యుద్ధప్రాతిపదికన కేకే లైన్‌ పునరుద్ధరణ పనులు

ABN , First Publish Date - 2023-09-26T00:24:07+05:30 IST

కొత్తవలస-కిరండోల్‌ లైన్‌లో రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు ఈ మార్గంలోని మన్బార్‌-జర్తి స్టేషన్ల మధ్య ట్రాక్‌పై మట్టి, రాళ్లు పడడంతో ఆదివారం నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

యుద్ధప్రాతిపదికన కేకే లైన్‌ పునరుద్ధరణ పనులు
పదిహేనుకు పైగా యంత్రాలతో సాగుతున్న ట్రాక్‌ పునరుద్ధరణ పనులు

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస-కిరండోల్‌ లైన్‌లో రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు ఈ మార్గంలోని మన్బార్‌-జర్తి స్టేషన్ల మధ్య ట్రాక్‌పై మట్టి, రాళ్లు పడడంతో ఆదివారం నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మట్టిని తొలగించే పనులను డీఆర్‌ంఎ సౌరభ్‌ ప్రసాద్‌ దగ్గరుండి చేయిస్తున్నారు. వెంటనే రైళ్ల రాకపోకలు పునురుద్ధరించేందుకు పెద్ద సంఖ్యలో యంత్రాలు, కూలీలను వినియోస్తున్నారు. ఈ పనుల కారణంగా పాసింజర్‌ రైళ్లు ఐదింటిని సోమవారం కూడా రద్దు చేశారు. త్వరగా ఈ మార్గాన్ని అందుబాటులోకి తెస్తామని డీఆర్‌ఎం తెలిపారు.

Updated Date - 2023-09-26T00:24:07+05:30 IST