Share News

బీఆర్‌టీఎస్‌ నిర్వాసితులకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2023-10-31T00:37:03+05:30 IST

బీఆర్‌టీఎస్‌ సింహాచలం కారిడార్‌ నిర్వా సితులకు న్యాయం చేయాలని కోరుతూ జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌కు బాధితుల తరఫున టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

బీఆర్‌టీఎస్‌ నిర్వాసితులకు న్యాయం చేయండి

సింహాచలం, అక్టోబరు 30 : బీఆర్‌టీఎస్‌ సింహాచలం కారిడార్‌ నిర్వా సితులకు న్యాయం చేయాలని కోరుతూ జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌కు బాధితుల తరఫున టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.సోమవారం వారు కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో రోడ్డు నిర్మాణం వల్ల నిర్వాసితులకు ఎదురవుతున్న సమస్యలను జేసీకి వివరించారు. ప్రధానంగా పూర్తిగా ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలని, కారిడార్‌ వల్ల కూల్చనున్న ఇళ్లను పునర్నిర్మించుకోవడానికి జీవీఎంసీ, సింహాచల దేవస్థానం నుంచి అనుమతులు ఇప్పించాలని, బీఆర్‌టీఎస్‌ నిర్మాణంలో భాగంగా రెండు రోడ్లు వేసి మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రస్తుత రోడ్డుకు ఇరువైపులా సమాన కొలతతో నూతన నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో 98వ వార్డు కార్పొరేటర్‌ పివి నరసింహం, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-31T00:37:03+05:30 IST