వైసీపీ పాలనలోనే బీసీలకు న్యాయం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:08 PM
వైసీపీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఆదివారం రింగురోడ్డులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనకాపల్లి టౌన్, డిసెంబరు 17 : వైసీపీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఆదివారం రింగురోడ్డులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత బీసీలను గుర్తించి న్యాయం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా న్యాయం చేశారని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకి జగన్ చేపట్టిన పాదయాత్రకి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్, మందపాటి జానకిరామరాజు, కొణతాల మురళీకృష్ణ, బొడ్డేడ లక్ష్మీనరసింహరావు పాల్గొన్నారు.