స్టీల్‌ప్లాంట్‌కు ‘జేఎ్‌సడబ్ల్యూ’ ప్రతినిధులు
ABN , First Publish Date - 2023-04-01T01:35:47+05:30 IST
దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉక్కు పరిశ్రమ జేఎ్‌సడబ్ల్యూ(జిందాల్ స్టీల్ వర్క్స్..
అధికారులతో భేటీ.. పోరాట కమిటీ ఆందోళన
ఎందుకు వచ్చారో తెలపాలన్న కార్మికులు
మరోసారి వస్తే తీవ్ర పరిణామాలంటూ హెచ్చరిక
ఉక్కుటౌన్‌షిప్ (విశాఖపట్నం), మార్చి 31: దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉక్కు పరిశ్రమ జేఎ్‌సడబ్ల్యూ(జిందాల్ స్టీల్ వర్క్స్.. ముంబై) సంస్థ ప్రతినిధులు శుక్రవారం విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి రావడం తీవ్ర కలకలం రేపింది. ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మికులు రెండేళ్లుగా తమ నిరసన తెలియజేస్తున్నారు. ఒకపక్క ఆర్థిక వనరులు లేకపోవడం, మరోపక్క కేంద్రం సహకరించకపోవడంతో కర్మాగారాన్ని నడపడానికి అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు, వాటితో ఉత్పత్తి చేసే స్టీల్‌ను తిరిగి తీసుకోవడానికి ఎవరైనా ముందుకు రావాలంటూ యాజమాన్యం వారం కిందట ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఆసక్తి వ్యక్తీకరణ...ఈవోఐ) ప్రకటనను జారీచేసింది. ఈ నేపథ్యంలో జేఎ్‌సడబ్ల్యూ సంస్థ ప్రతినిధులు అశోక్‌కుమార్ పరసరామక, మాయనక్‌పాండే, పూరి రాజేష్, జోగిందర్‌పాల్, సునీల్ షిండే, ఎ.శ్రీనివాసరావు, వీరేష్ బెల్లెటి స్టీల్‌ప్లాంటుకు విచ్చేసి పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. దీంతో పోరాట కమిటీ నాయకులు కార్యాలయం వద్ద బైఠాయించారు. జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులు ఎందుకు వచ్చారో తెలపాలని, స్టీల్‌ప్లాంట్‌కు వచ్చేందుకు ఎవరు అనుమతిచ్చారో వెల్లడించాలని నినాదాలు చేశారు. జేఎ్‌సడబ్ల్యూ ప్రతినిధులను అడ్డుకున్నారు. మరోసారి ప్లాంట్‌కు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె.అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్ జోలికొస్తే సహించేది లేదు
స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఎంత టి త్యాగాలకైనా సిద్ధం. ప్లాంటులోకి ఇతర సంస్థల ప్రతినిధులు రావడం సరికాదు. బ్యాంకులకు ఎగనామం పెట్టే సంస్థలు ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోకి రావడం దుర్మార్గం. ప్రైవేటు సంస్థ ప్రతినిధులెవ్వరినీ ప్లాంట్‌లోకి అడుగుపెట్టనివ్వం. ఈవోఐ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
- డి.ఆదినారాయణ, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్