జీవో నంబరు 1ను తక్షణమే రద్దు చేయాలి
ABN , First Publish Date - 2023-01-15T00:03:54+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహించకుండా జారీ చేసిన జీవో నంబరు 1ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు డిమాండ్ చేశారు.
సిరిపురం, జనవరి 14 : వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహించకుండా జారీ చేసిన జీవో నంబరు 1ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు డిమాండ్ చేశారు. శనివా రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 1 పత్రులను భోగి మంటలో వేసి తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర హైకోర్టులో ప్రజావాజ్యం వేయగా విచారణ చేపట్టిన కోర్టు జీవో అమలు ఈనెల 23వ తేదీ వరకు నిలుపుదల చేయాలని ఆదేశించిందన్నారు. ఇది జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టని, ఇప్పటికైనా జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎస్.కె. రెహమాన్, చంద్రశేఖర్, క్షేత్రపాల్, ఎస్. మురళీ, తదితరులు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలి
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను నెలకొల్పకపోగా ఉన్న వాటిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గపు చర్య అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో భాగంగా శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో భోగి మంట ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఒక్కొక్క కట్టె వేసి సేవ్ స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ టీయూ నాయకులు కుమార్ మంగళం, సుబ్బారావు, రాజు, చంద్రమౌళి, కుమారి, తదితరులు పాల్గొన్నారు.