ఆరిలోవ రోడ్డు బాగు చేయాలని జనసేన నేత ఆమరణ నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2023-01-29T01:12:23+05:30 IST
గొలుగొండ మండలం చీడిగుమ్మల, యర్రవరం నుంచి అరిలోవ అటవీ ప్రాంతం వరకు 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వీర సూర్యచంద్ర ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిం చారు
నర్సీపట్నం అర్బన్, జనవరి 28 : గొలుగొండ మండలం చీడిగుమ్మల, యర్రవరం నుంచి అరిలోవ అటవీ ప్రాంతం వరకు 3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వీర సూర్యచంద్ర ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరిలోవ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, తరుచూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అటవీ శాఖ అనుమతులు ఇచ్చినప్పటికీ ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.40లక్షలు తీసుకురావడంలో ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. నియోజకవర్గంలో రోడ్లను పట్టించుకోని ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు మద్దతుగా 9వ వార్డు జనసేన కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య, అద్దేపల్లి గణేష్, రామశేఖర్, చిరంజీవి, శ్రీను, సంతోష్ పాల్గొన్నారు.