జనసేన నుంచి ఎవరూ వెళ్లలేదు..

ABN , First Publish Date - 2023-05-19T00:50:07+05:30 IST

తమ పార్టీ నుంచి ఎవరూ వైసీపీలో గురువారం చేరలేదని జనసేన మండల అధ్యక్షుడు, దిబ్బపాలెం మాజీ సర్పంచ్‌ బైలపూడి శ్రీరామదాసు అన్నారు.

జనసేన నుంచి ఎవరూ వెళ్లలేదు..
డిసీసీబీ మాజీ చైర్మన్‌ సుకుమార వర్మ ఆధ్వర్యంలో 2020లో వైసీపీలో చేరిన సూరిబాబు

అచ్యుతాపురం, మే 18: తమ పార్టీ నుంచి ఎవరూ వైసీపీలో గురువారం చేరలేదని జనసేన మండల అధ్యక్షుడు, దిబ్బపాలెం మాజీ సర్పంచ్‌ బైలపూడి శ్రీరామదాసు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాంబిల్లి తదితర మండలాల నుంచి భారీ స్థాయిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారని, దీనిని తట్టుకోలేక తండ్రీకొడుకులు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. దిబ్బపాలెం వార్డు వెంబరు గుర్రం సూరిబాబు, అనుచరులు 2020లోనే సుకుమార వర్మ సమక్షంలో వైసీపీలో చేరారని, అప్పటి ఫొటో విడుదల చేశారన్నారు. ఇటువంటి కుయుక్తులు మాని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై శ్రద్ధ చూపాలని సూచించారు.

Updated Date - 2023-05-19T00:50:07+05:30 IST