గుర్రంగెడ్డ వద్ద జన సైనికులు ఆందోళన

ABN , First Publish Date - 2023-02-07T00:53:46+05:30 IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలులో వైసీపీ నాయకులు విఫలం చెందడాన్ని నిరసిస్తూ ఆదివారం పొట్టిదొరపాలెం గుర్రంగెడ్డ వద్ద జనసేన పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.

గుర్రంగెడ్డ వద్ద జన  సైనికులు ఆందోళన
గుర్రంగెడ్డ వద్ద ఆందోళన చేస్తున్న జనసైనికులు

బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 6: ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలులో వైసీపీ నాయకులు విఫలం చెందడాన్ని నిరసిస్తూ ఆదివారం పొట్టిదొరపాలెం గుర్రంగెడ్డ వద్ద జనసేన పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. గుర్రంగెడ్డ అవతల ఆరు గ్రామాలకు చెందిన రెండు వేల ఎకరాల సాగు భూమి ఉంది. భారీ వర్షాలు, వరద సమయాల్లో ఉధృతంగా ప్రవహించే గెడ్డను రైతులు ప్రాణాలకు తెగించి దాటుతారన్నారు. అలా దాటే క్రమంలో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నాయకులు గుర్రంగెడ్డపై వంతెన నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆ పార్టీకి ఓటు వేశారన్నారు. నాలుగేళ్లు కావస్తున్నా వైసీపీ నేతలు వంతెన నిర్మాణం ఊసే ఎత్తకపోవడంపై జన సైనికులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని జనసేన చోడవరం నియోజకవర్గం నాయకుడు జెర్రిపోతుల నానాజీ హెచ్చరించారు.

Updated Date - 2023-02-07T00:53:46+05:30 IST