జగన్‌ పాలనకు త్వరలోనే ముగింపు

ABN , First Publish Date - 2023-09-22T23:56:53+05:30 IST

జగన్‌ నియంత పాలన త్వరలోనే ముగుస్తుందని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

జగన్‌ పాలనకు త్వరలోనే ముగింపు

సిరిపురం, సెప్టెంబరు 22 : జగన్‌ నియంత పాలన త్వరలోనే ముగుస్తుందని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాము అరెస్టులకు భయపడమని, ఎన్ని అరెస్టులు చేసినా చంద్రబాబు బయటకు వచ్చేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతుందన్నారు. కేవలం జగన్‌ను ఏ1 అనడం, జైల్‌ ఖైదీ అనడాన్ని సహించలేక చంద్రబాబును ఎటువంటి ఆరాధాలు లేకుండా అరెస్టు చేయించి ఆనందం పొందుతున్నారన్నారు. చంద్రబాబు కడిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. కాగా న్యాయదేవత బొమ్మ పట్టుకుని టీడీపీ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మీ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్‌, బుడుమూరి గోవిందు, తమ్మిన విజయ్‌కుమార్‌, కోట నరేష్‌, ఊరుకూటి డేవిడ్‌, మొల్లేటి కుమార్‌స్వామి, వానపల్లి సత్య, ప్రధాన కార్యదర్శులు కాళీప్రసాద్‌, మొల్లి పెంటరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:56:53+05:30 IST