Share News

99 శాతం హామీలు అమలు ఎక్కడ జగన్‌

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:47 PM

: వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటుందని టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు విమర్శించారు.

99 శాతం హామీలు అమలు ఎక్కడ జగన్‌

భీమునిపట్నం, డిసెంబరు 30 : వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటుందని టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు విమర్శించారు. శనివారం ఆయన చిన్నబజారులో వున్న పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీల్లో 85 శాతం అమలుకు నోచుకోలేదన్నారు. నవరత్నాలు, మేనిఫెస్టోలో 199 హామీలు ఉండగా అందులో కేవలం 17 హామీలను మాత్రమే నెరవేర్చారన్నారు. మరో 43 పాక్షికంగా అమలు చేయగా, అసలు అమలుకు నోచుకోనివి 109 వున్నాయన్నారు. పాదయాత్రలో ఇచ్చిన 51 హామీల్లో 44 పూర్తిగా అమలు చేయలేదని తెలిపారు. అలాగే పాదయాత్రలో జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు 480 వుండగా, 468 హామీలను విస్మరించారన్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించేందుకు బుక్‌ లెట్‌ విడుదల చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, నాయకులు మారోజు సంజీవ్‌కుమార్‌, గరే సదానంద, కనకల అప్పలనాయుడు, కంచర్ల కామేష్‌, దొంతల కనకరాజు, వియ్యపు పోతురాజు, వాసుపల్లి వంశీ, దొంతల అప్పలనాయుడు ఉన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:47 PM