Share News

జగన్‌ సారూ...మా అంగన్‌వాడీ సెంటర్లు తెరపించరూ

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:56 AM

సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె ఆరో రోజూ కొనసాగింది.

జగన్‌ సారూ...మా అంగన్‌వాడీ సెంటర్లు తెరపించరూ

విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):

సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె ఆరో రోజూ కొనసాగింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనలో అంగన్‌వాడీల సమస్యలు సత్వరమే పరిష్కరించాలంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల సిబ్బంది సంఘం గౌరవాధ్యక్షురాలు పి.మణి మాట్లాడుతూ వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుచేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. సమ్మెకు టీడీపీ దక్షిణ ఇన్‌చార్జి గండి బాబ్జీ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, సీపీఐ (ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి కొండయ్య, ఏఐటీయూసీ స్టీల్‌ప్లాంట్‌ నాయకులు రామకృష్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఆందోళనలో అంగన్‌వాడీ నేతలు వై.తులసి, ఆర్‌.శోభారాణి, శ్యామల, రామలక్ష్మి, పాప, వేణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:56 AM