Share News

రాష్ట్రాన్ని ఆందోళనాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న జగన్‌

ABN , Publish Date - Dec 27 , 2023 | 11:14 PM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు ఆందోళనకు దిగే పరిస్థితిని సీఎం జగన్‌ తీసుకువచ్చారని టీడపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు.

రాష్ట్రాన్ని ఆందోళనాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న జగన్‌
సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాదుల శ్రీనివాస్‌

టీడీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌

గాజువాక, డిసెంబరు 27: రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు ఆందోళనకు దిగే పరిస్థితిని సీఎం జగన్‌ తీసుకువచ్చారని టీడపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలు, మునిసిపల్‌ కార్మికులు, సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు, ఇలా అన్ని రంగాల కార్మికులు నేడు రోడ్డెక్కే పరిస్థితిని సీఎం తీసుకువచ్చారని విమ ర్శించారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. సమావేశంలో నాయకులు తమిర శివప్రసాద్‌, పోతిన వెంకటేశ్వరరావు, వాసు, దశేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 11:15 PM