అవినీతి పాలనకు బ్రాండ్ అంబాసిడర్ జగన్
ABN , First Publish Date - 2023-02-17T00:15:01+05:30 IST
అవినీతి, అసమర్ధ పాలనకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. గురువారం 74వ వార్డు వియ్యపువానిపాలెంలో చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
టీడీపీ ‘గాజువాక’ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్
పెదగంట్యాడ ,ఫిబ్రవరి 16: అవినీతి, అసమర్ధ పాలనకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. గురువారం 74వ వార్డు వియ్యపువానిపాలెంలో చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాయ్ హత్య కేసు తెరమీదకు రాగానే విశాఖ రాజధాని అంశాన్ని తెరమీదకు తెచ్చి జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే నెలకు జీతం రూ.15 వేలు చేస్తామని వలంటీర్లను జగన్, వైసీపీ నేతలు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని, జగన్ నియంత పాలనకు పతనం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్‌చార్జి వియ్యపు కొండబాబు, నాయకులు రమేశ్, చిన్నోడు, అప్పలనాయుడు, శివప్రసాద్, సన్నీ, వెంకునాయుడు, తదితరులు పాల్గొన్నారు.