‘పెట్టుబడుల సదస్సు’ పెద్ద డ్రామా: బొండా

ABN , First Publish Date - 2023-03-02T03:18:51+05:30 IST

విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు నిర్వహణ పెద్ద డ్రామా అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

‘పెట్టుబడుల సదస్సు’ పెద్ద డ్రామా: బొండా

విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు నిర్వహణ పెద్ద డ్రామా అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను బయటకు వెళ్లగొట్టి, రూ.రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని, తమ పార్టీ అభ్యర్థికి ఓట్లేయాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు అడగడం పచ్చి మోసమన్నారు. వారంలో రెండు రోజులు విశాఖ కేంద్రంగా సీఎం పాలన చేస్తారని బయటకు లీకులు ఇవ్వడం వల్ల నగరానికి, ఉత్తరాంధ్రకు ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.

Updated Date - 2023-03-02T03:18:51+05:30 IST