అటవీ శాఖలో బది‘లీలలు’

ABN , First Publish Date - 2023-06-03T00:50:31+05:30 IST

అటవీ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రవహసంగా మారింది. డీఎఫ్‌వో పరిధిలో ముగ్గురు గార్డులు, ఇద్దరు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లను బదిలీ చేశారు. మే 31వ తేదీ రాత్రి 12 గంటలతో బదిలీ ప్రక్రియకు గడువు ముగిసింది. ఆ రోజు అర్ధరాత్రి వరకు డీఎఫ్‌వో ఆఫీసులో తర్జనభర్జనలు పడి మరుసటి రోజు సాయంత్రం బదిలీ ఆర్డర్స్‌ ఇచ్చారు. సీసీఎఫ్‌ ఆధ్వర్యంలో అటవీ శాఖ స్క్వాడ్‌ విభాగంలో పనిచేసే ఒక గార్డును సాధారణ విధులకు బదిలీ చే యడంపై నర్సీపట్నం డీఎఫ్‌వో, స్క్వాడ్‌ డీఎఫ్‌వోల మధ్య వివాదం రాజుకుంది. స్క్వాడ్‌ విభాగంలో పని చేసే సిబ్బందిని బదిలీ చేసేటప్పుడు విశాఖప్నంలోని సీసీఎఫ్‌ అనుమతి తీసుకోవాలి.

అటవీ శాఖలో బది‘లీలలు’
నర్సీపట్నంలో డీఎఫ్‌ఓ కార్యాలయం

మే 31వ తేదీ రాత్రితో ప్రక్రియ పూర్తి

మరుసటి రోజు సాయంత్రం ఆర్డర్స్‌ ఇచ్చిన డీఎఫ్‌వో

స్క్వాడ్‌ సిబ్బంది బదిలీపై వివాదం

డీఎప్‌వోపై స్క్వాడ్‌ డీఎఫ్‌వో, సీసీఎఫ్‌ సీరియస్‌

నర్సీపట్నం, జూన్‌ 2: అటవీ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రవహసంగా మారింది. డీఎఫ్‌వో పరిధిలో ముగ్గురు గార్డులు, ఇద్దరు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లను బదిలీ చేశారు. మే 31వ తేదీ రాత్రి 12 గంటలతో బదిలీ ప్రక్రియకు గడువు ముగిసింది. ఆ రోజు అర్ధరాత్రి వరకు డీఎఫ్‌వో ఆఫీసులో తర్జనభర్జనలు పడి మరుసటి రోజు సాయంత్రం బదిలీ ఆర్డర్స్‌ ఇచ్చారు. సీసీఎఫ్‌ ఆధ్వర్యంలో అటవీ శాఖ స్క్వాడ్‌ విభాగంలో పనిచేసే ఒక గార్డును సాధారణ విధులకు బదిలీ చే యడంపై నర్సీపట్నం డీఎఫ్‌వో, స్క్వాడ్‌ డీఎఫ్‌వోల మధ్య వివాదం రాజుకుంది. స్క్వాడ్‌ విభాగంలో పని చేసే సిబ్బందిని బదిలీ చేసేటప్పుడు విశాఖప్నంలోని సీసీఎఫ్‌ అనుమతి తీసుకోవాలి. అందులో పని చేసే సిబ్బందిని వెనక్కు తీసుకునేటప్పుడు స్క్వాడ్‌ డీఎఫ్‌వోకి సమాచారం ఇవ్వాలి. ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే బదిలీ చేయడంతో స్క్వాడ్‌ డీఎఫ్‌వో సోమసుందరం నర్సీపట్నం డీఎఫ్‌వోని నిలదీసినట్టు సమాచారం. స్క్వాడ్‌లో పని చేసే గార్డును సాధారణ విధులకు తీసుకునేటప్పుడు సీసీఎఫ్‌కి చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని స్క్వాడ్‌ డీఎఫ్‌వో ప్రశ్నించినట్టు తెలిసింది. తన దగ్గర పని చేసే స్క్వాడ్‌ సిబ్బందిని చెప్పాపెట్టకుండా బదిలీ చేయడంపై నర్సీపట్నం డీఎఫ్‌వోపై సీసీఎఫ్‌ కూడా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం ఒకేచోట రెండేళ్ల సర్వీసు దాటకుండా సిబ్బందిని బదిలీ చేయకూడదు. స్క్వాడ్‌ గార్డు విధుల్లో చేరి ఏడాది పూర్తి కాకుండా బదిలీ చేయడం అటవీ శాఖలో చర్చనీయాశంగా మారింది. నర్సీపట్నం రేంజ్‌లోని కోటవురట్ల సెక్షన్‌ కోడూరు బీట్‌లో పనిచేసే గార్డుని చింతపల్లి డివిజన్‌ శరభన్నపాలెం బీట్‌లోని సిగనాపల్లికి బదిలీ చేశారు. సిగనాపల్లిలో పని చేస్తున్న గార్డుని కోడూరు బీట్‌కి రప్పించారు. గార్డుని చింతపల్లి ఫారెస్టు డివిజన్‌కి బదిలీ చేసేటప్పుడు అక్కడ డీఎఫ్‌వోకి తెలియజేయాలి. దీనికి తోడు ఈ గార్డు మర్రిపాకలలో పని చేసి బదిలీ మీద వచ్చి ఏడాది నిండకుండా బదిలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2023-06-03T00:50:31+05:30 IST