చెవిలో పువ్వులతో వినూత్న నిరసన
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:56 AM
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది.
సిరిపురం, డిసెంబరు 23:
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందంటూ...శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న శిబిరంలో అంగన్‌వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నేత సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుండా బలవంతంగా తాళాలను బద్ధలు కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు సమస్యలు పరిష్కరించలేని మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, జయశ్రీ, షిప్‌యార్డ్ యూనియన్ నాయకులు ప్రసాద్, జానకీరామ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, యూనియన్ గౌరవ అధ్యక్షులు పి.మణి, తులసి, ఇందిరా, ఈశ్వరమ్మ, రత్నం, తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.