ఏసీబీ వలలో హెడ్ కానిస్టేబుల్
ABN , Publish Date - Dec 22 , 2023 | 01:46 AM
ఒక కేసులో సెక్షన్ మార్చకుండా ఉండేందుకు నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ గాజువాక హెడ్ కానిస్టేబుల్ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఖాకీ
గాజువాక, డిసెంబరు 21:
ఒక కేసులో సెక్షన్ మార్చకుండా ఉండేందుకు నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ గాజువాక హెడ్ కానిస్టేబుల్ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రైల్వే న్యూ కాలనీ ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ గాజువాక పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆ కేసును 307 ఐపీసీగా మార్చకుండా ఉండేందుకు హెడ్‌కానిస్టేబుల్ పి.రాజశేఖర్ ఐదు వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రసూల్...ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం స్టేషన్‌లో రసూల్ వద్ద నుంచి హెడ్‌కానిస్టేబుల్ రాజశేఖర్ ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా మూడేళ్ల క్రితం ఇదే స్టేషన్‌లో ఓ వ్యక్తి మృతికి సంబంధించి పోస్టుమార్గం రిపోర్టు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసి రైటర్ ఏసీబీ అఽధికారులు పట్టుకున్నారు.