పెట్టుబడుల సదస్సులో పరువు తీశారు

ABN , First Publish Date - 2023-03-05T01:10:44+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ వైసీపీ కార్యకర్తల సదస్సులా మారిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు.

పెట్టుబడుల సదస్సులో పరువు తీశారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బుద్ద నాగజగదీశ్‌

అనకాపల్లి అర్బన్‌, మార్చి 4 : ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ వైసీపీ కార్యకర్తల సదస్సులా మారిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో వైసీపీ కార్యకర్తలు రాష్ట్ర పరువు తీసేలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు ఆశ్చ ర్యపోయేలా వైసీపీ నాయకులు, కార్యకర్తలు భోజనాల కోసం గందరగోళం సృష్టించి, ఇన్వె స్టర్లకు భోజనాలు లేకుండా చేశారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు కేటాయించిన సీట్లలో వైసీపీ నేతలు కూర్చొవడం దారుణమన్నారు. వఏపీకి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్న వారిలో అధికశాతం మంది గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్న వారేనని పేర్కొన్నారు. ఇవన్నీ బూటకపు పెట్టుబడులేనని, వచ్చే ఎన్నికల్లో ప్రజలను నమ్మించడానికే ఇలా నిర్వహించారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు మళ్ల గణేష్‌, బుద్ద భువనేశ్వరరావు, సాలాపు నాయుడు, కోట్ని రామకృష్ణ పాల్గొన్నారు.

‘గ్లోబల్‌ సమ్మిట్‌ ఎన్నికల స్టంట్‌’

పరవాడ: విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ ఎన్నికల స్టంట్‌ అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ మైండ్‌గేమ్‌ అడుతూ ఏపీ ప్రజలను మోసంచేస్తుందని మండిపడ్డారు. మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్కప్రాజెక్టుకు శంకుస్థాపన చేయలేదని, ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మోసం చేయాలన్న ఆలోచనతోనే విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించిందని ఆరోపించారు.

Updated Date - 2023-03-05T01:10:44+05:30 IST