Share News

స్టీల్‌ప్లాంటు డైరెక్టర్‌ (కమర్షియల్‌)గా జీవీఎన్‌ ప్రసాద్‌

ABN , First Publish Date - 2023-11-10T01:20:37+05:30 IST

స్టీల్‌ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌...ఆర్‌ఐఎన్‌ఎల్‌) కమర్షియల్‌ డైరెక్టర్‌గా ఘంటశాల వెంకట నాగాంబిక ప్రసాద్‌ నియమితులయ్యారు.

స్టీల్‌ప్లాంటు డైరెక్టర్‌ (కమర్షియల్‌)గా జీవీఎన్‌ ప్రసాద్‌

విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌...ఆర్‌ఐఎన్‌ఎల్‌) కమర్షియల్‌ డైరెక్టర్‌గా ఘంటశాల వెంకట నాగాంబిక ప్రసాద్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఆర్‌ఐఎన్‌ఎల్‌లో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కమర్షియల్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీ కావడంతో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల సెలక్షన్‌ బోర్డు ఏడుగురిని ఇంటర్వ్యూకు పిలిచి ప్రసాద్‌ను ఎంపిక చేసినట్టు గురువారం ప్రకటించింది.

Updated Date - 2023-11-10T01:20:38+05:30 IST