Share News

నేడు జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2023-12-11T01:15:18+05:30 IST

జీవీఎంసీ కౌన్సిల్‌ సాధారణ సమావేశం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన సోమవారం జరగనుంది.

నేడు జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ కౌన్సిల్‌ సాధారణ సమావేశం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన సోమవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం కోసం 18 అంశాలతో ప్రధాన అజెండా, మరో 25 అంశాలతో అనుబంధ అజెండాను సభ్యులకు అందజేశారు. ఇందులో దసపల్లా హిల్స్‌ మీదుగా వంద అడుగుల రోడ్డు నిర్మాణం కోసం రూ.4.36 కోట్లు వెచ్చించేందుకు కౌన్సిల్‌ అనుమతికి సిద్ధం చేసిన ప్రతిపాదనపై విపక్షసభ్యులు నిలదీసే అవకాశం ఉంది. క్లాప్‌ వాహనాలకు లోడర్లుగా 650 మందిని రోజువారీ కూలి ప్రాతిపదికన నియమించుకునే అంశంతో పాటు రూ.99 కోట్లతో ముడసర్లోవలో నిర్మించతలపెట్టిన జీవీఎంసీ భవన నిర్మాణ ప్రతిపాదనపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశముంది.

Updated Date - 2023-12-11T01:15:19+05:30 IST