9న జీవీఎంసీ బడ్జెట్ సమావేశం
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:10 AM
జీవీఎంసీ బడ్జెట్ సమావేశం జనవరి తొమ్మిదిన నిర్వహించనున్నట్టు కార్యదర్శి పి.నల్లనయ్య తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ బడ్జెట్ సమావేశం జనవరి తొమ్మిదిన నిర్వహించనున్నట్టు కార్యదర్శి పి.నల్లనయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశమై బడ్జెట్ ముసాయిదాపై చర్చించనున్నది. బడ్జెట్ ముసాయిదాను సభ్యులకు అందజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,457.23 కోట్లతో జీవీఎంసీ ముసాయిదా బడ్జెట్‌ను అధికారులు రూపొందించారు. దీనిని స్టాండింగ్ కమిటీ ఈనెల 28న ఆమోదించింది. కౌన్సిల్ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నారు.