ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:12 AM
జిల్లావ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
జిల్లావ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర పరిధిలో ప్రధానంగా సెయింట్ ఆంథోనీ చర్చితోపాటు జ్ఞానాపురం, సీతమ్మధార, వన్‌టౌన్, సిరిపురం, ఎన్‌ఏడీ, తదితర ప్రాంతాల్లో గల చర్చిల్లో ఆదివారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సోమవారం ఉదయం నుంచి చర్చిల్లో మత పెద్దలు బైబిల్‌లోని వాక్యాలు చదివి వినిపించడంతోపాటు క్రీస్తు బోధనలను వివరించారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
- విశాఖపట్నం