సింహగిరిపై ఘనంగా సంక్రాంతి సంబరాలు
ABN , First Publish Date - 2023-01-14T23:59:43+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిఽధిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. భోగి పురస్కరించుకుని శనివారం ఉదయం నుంచి సింహగిరికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భోగి మంటలను వెలిగించడం ద్వారా విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి, సింహాచల దేవస్థానం పాలక మండలి సభ్యులు ఉత్సవానికి శ్రీకారం చుట్టారు.
సింహాచలం, జనవరి 14 : వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిఽధిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. భోగి పురస్కరించుకుని శనివారం ఉదయం నుంచి సింహగిరికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భోగి మంటలను వెలిగించడం ద్వారా విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి, సింహాచల దేవస్థానం పాలక మండలి సభ్యులు ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. కృష్ణాపురం గోశాలలో 15 రోజుల నుంచి ఆవుపేడతో తయారు చేసిన పిడకల దండలను అధికారులు, భక్తులు భోగి మంటల్లో వేశారు. మంటల చుట్టూ హరిదాసు, జంగమదేవరలు భజనలు చేస్తూ ప్రదక్షిణంగా తిరిగారు. కొందరు భక్తులు వారిని అనుసరిస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణలు చేశారు. దేవస్థానం గోశాలలోని గోవుల నుంచి సేకరించి తీసుకువచ్చిన పాలతో ప్రత్యేక పొయ్యలపై కొందరు మగు వలు తెలుగువారి ఆనవాయితీ ప్రకారం కొత్త బియ్యంతో పరమాన్నం తయారు చేసి పంపిణీ చేశారు. పల్లెవాతారణం ప్రతిబించే విధంగా గడ్డితో తయారు చేసిన గుడిసెలు వేసి వాటి ముందు రంగులు అద్దిన కుండలను, చెరుకు గడలను ఉంచి, నృసింహ మండపం చుట్టూ మాడవీధులను శోభాయమానంగా తీర్చిదిద్దారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎడ్లబండి, ఎద్దులు, గోవులు, కోళ్లను, ఎండుగడ్డిని ప్రదర్శనలో ఉంచారు. ఉత్సవ ఏర్పాట్లను దేవాలయ ఏఈవోలు నరసింహరాజు, పీఆర్‌ఓ అప్పలనాయుడు, ఏఈఓ రమణమూర్తి, ఈఈ బండారు రాంబాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు వారణాసి దినేష్‌రాజ్, గంట్ల శ్రీనుబాబు, దొడ్డి రమణ, పి శ్రీదేవివర్మ, ఎస్ శ్రీదేవి, పి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.