గోవాడ చెరకు రైతుల బకాయిలు చెల్లించండి

ABN , First Publish Date - 2023-07-21T01:08:30+05:30 IST

గోవాడ సభ్య రైతులకు చెరకు బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ చెరకు రైతు సంఘం జిల్లా నాయకులు కర్రి అప్పారావు డిమాండ్‌ చేశారు.

గోవాడ చెరకు రైతుల బకాయిలు చెల్లించండి
ఎండీకి వినతిపత్రం ఇస్తున్న రైతు సంఘం నేతలు

చోడవరం, జూలై 20 : గోవాడ సభ్య రైతులకు చెరకు బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ చెరకు రైతు సంఘం జిల్లా నాయకులు కర్రి అప్పారావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం ఆయన చెరకు రైతుల సమస్యలపై గోవాడ షుగర్స్‌ ఎండీ వి.సన్యాసినాయుడుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెరకు బకాయిలు వెంటనే చెల్లించడంతోపాటు, ఫ్యాక్టరీ ఆధునికీకరణ, ఇతర సమస్యలపై స్పందించాల కోరారు. బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గోవాడ ఫ్యాక్టరీ ఆఽధునికీకరణ కూడా చేపట్టి, ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఫ్యాక్టరీలో రికవరీ శాతం తక్కువగా వస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని, దీని నివారణ చర్యలు చేపట్టాలని ఎండీకి సూచించారు. ఎండీని కలిసిన వారిలో రైతు సంఘం నాయకులు అప్పలరాజు, గండి నాయనిబాబు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-07-21T01:08:30+05:30 IST