అడ్డాకులకు మంచి ధర

ABN , First Publish Date - 2023-06-26T01:14:46+05:30 IST

అడ్డాకులకు మంచి ధర పలుకుతుండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం రూ.500 నుంచి రూ.600 పలికే దిండు అడ్డాకులు ఇప్పుడు రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. దీంతో తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని వారు చెబుతున్నారు.

అడ్డాకులకు మంచి ధర
అడ్డాకులను దిండులుగా కట్టి సుంకరమెట్ట సంతకు తీసుకువచ్చిన గిరిజనులు

- ప్రస్తుతం దిండు ఆకులు రూ.1000 నుంచి రూ.1200

- నెల రోజుల క్రితం రూ.500 నుంచి రూ.600

- శ్రమకు తగ్గ ఫలితం దక్కుతోందని గిరిజనుల ఆనందం

అరకులోయ, జూన్‌ 25: అడ్డాకులకు మంచి ధర పలుకుతుండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం రూ.500 నుంచి రూ.600 పలికే దిండు అడ్డాకులు ఇప్పుడు రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. దీంతో తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని వారు చెబుతున్నారు.

మారుమూల గ్రామ పంచాయతీలైన లోతేరు, ఇరగాయి, మాదల పరిధిలో ఉన్న శివారు గ్రామాల గిరిజనులు అడవిలో సేకరించిన అడ్డాకులకు గత రెండు వారాల నుంచి మంచి ధర లభిస్తోంది. ప్రస్తుతం దిండు అడ్డాకులు రూ.1000 నుంచి రూ.1200 పలుకుతున్నాయి. అదే దిండు ఆకులకు నెల రోజుల క్రితం రూ.500 నుంచి రూ.600 ధర పలికేది. వాస్తవానికి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇచ్చి గిరిజన రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే జీసీసీ గత కొన్నేళ్ల నుంచి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం మానేయడంతో గిరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదృష్టం కొద్దీ వ్యాపారులలో పోటీ పెరిగితే గిరిజనులు సేకరించి సంతకు తీసుకువచ్చిన అటవీ ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. లేకుంటే తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత కొన్ని వారాల నుంచి సుంకరమెట్ట సంతకు గిరిజనులు అడవి నుంచి సేకరించి బాగా ఆరబెట్టి విక్రయానికి తెచ్చిన అడ్డాకుల దిండుకు మంచి రేటు లభిస్తుండడంతో హర్షం వక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-06-26T01:14:46+05:30 IST