సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2023-03-19T01:11:39+05:30 IST

నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయండి
అధికారులకు సూచనలు చేస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు

జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు

మర్రిపాలెం, మార్చి 18: నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన క్షేత్రస్ధాయిలో పర్యటినలో భాగంగా మురళీనగర్‌, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ప్లైఓవర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి-20 సదస్సు నేపథ్యంలో నగర సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రధాన మార్గంలోని బారికేడ్ల వద్ద వినియోగంలో లేని కేబుల్‌ వైర్లు తొలగించాలని, అవసరమైన వైర్లను క్రమబద్ధీకరించాలని, అనుమతిలేని ప్రకటన బోర్లులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైలింగ్‌కు పెయింటింగ్‌ రెండవసారి వేయాలని, సెంట్రల్‌ మీడియంలో మరిన్ని మొక్కలు నాటాలన్నారు. పాతబడిన సూచిక బోర్డులను తొలగించి నూతనంగా బోర్డులు ఏర్పాటు చేయాలని, బస్‌ షెల్డర్లను ఆధునీకరించాలని ఆదేశించారు. మర్రిపాలెంలో ఉన్న ఇరవై నాలుగు గంటల తాగునీటి ప్రాజెక్టును పరిశీలించేందుకు అతిథులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని, అందువలన ప్రజలకు త్రాగునీరు ఏవిధంగా అందిస్తున్నామో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేయాలన్నారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్‌ హార్టికల్చర్‌ డీడీ ఎం.దామోదరరావు, జోనల్‌ కమిషనర్లు ఆర్జీవి కృష్ణ, మల్లయ్యనాయుడు, పర్యవేక్షక ఇంజనీర్‌ కె.వేణుగోపాలరావు, డీసీపీ సంజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:11:39+05:30 IST