Share News

మరో నాలుగు కొవిడ్‌ కేసులు

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:58 AM

జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి.

మరో నాలుగు కొవిడ్‌ కేసులు

ఏడుకు చేరిన బాధితుల సంఖ్య

కొద్దిరోజులపాటు అప్రమత్తత అవసరం

విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మళ్లీ కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ముగ్గురికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కాగా, శనివారం జిల్లావ్యాప్తంగా 24 మందికి పరీక్షలు నిర్వహించగా, నలుగురి (ముగ్గురు పురుషులు, ఒకరు మహిళ)కి పాజిటివ్‌ వచ్చింది. వీరు మధురానగర్‌, సాగర్‌దుర్గా హాస్పిటల్‌ సమీపంలో గల కృష్ణానగర్‌, ఆరిలోవ, ఎంవీపీ కాలనీ ప్రాంతాలకు చెందినవారిగా అధికారులు వెల్లడించారు. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. వీరిలో ఆరుగురు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండగా, ఒకరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరి నుంచి నమూనాలను సేకరించి వైరస్‌ వేరియంట్‌ నిర్ధారణకు విజయవాడలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబు తున్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నందున కొవిడ్‌కు సంబంధించి గతంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌లు ధరించాలని, వీలైనంత వరకూ రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడం మేలని సూచిస్తున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:58 AM