రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
ABN , First Publish Date - 2023-12-11T00:16:39+05:30 IST
డాక్‌యార్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
ఒకరి పరిస్థితి విషమం
మల్కాపురం, డిసెంబరు 10: డాక్‌యార్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. డాక్‌యార్డు సమీపంలో ఎదురుగా వస్తున రెండు ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ఢీకొన్నాయి. దీంతో నలుగురు వ్యక్తులు కింద పడిపోయారు. వీరిలో ముగ్గురికి స్వల్ప గాయాలవ్వగా, ఒకరికి నుదుటపై తీవ్ర గాయమైంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మల్కాపురం ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు గాయపడిన వారిని చికిత్ప నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారి పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం వల్ల వారి వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.