ఎర్రచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2023-03-31T01:19:12+05:30 IST

అనకాపల్లి పట్టణానికి ఆనుకొని ఉన్న కొత్తూరు గ్రామ పంచాయతీకి చెందిన ఎర్రచెరువు అభివృద్ధి పనులకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ గురువారం శంకుస్థాపన చేశారు.

ఎర్రచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎర్రచెరువు అభివృద్ధి పనుల మ్యాప్‌ వివరాలను మంత్రికి తెలియజేస్తున్న జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

కొత్తూరు, మార్చి 30: అనకాపల్లి పట్టణానికి ఆనుకొని ఉన్న కొత్తూరు గ్రామ పంచాయతీకి చెందిన ఎర్రచెరువు అభివృద్ధి పనులకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ గురువారం శంకుస్థాపన చేశారు. తుమ్మపాల రెవెన్యూ సర్వే నంబరు 608/1లో గతంలో అనకాపల్లి మున్సిపాలిటీలో ఉన్నప్పుడు డంపింగ్‌ యార్డుకు కేటాయించిన 7.68 ఎకరాల స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసేందుకు లారస్‌ కంపెనీ యాజమాన్య ప్రతినిధులు ముందుకు వచ్చారని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. కొత్తూరు ఎర్రచెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసి అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కబ్జాకు గురి కాకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వాకర్స్‌కు అనువుగా ఉండే విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ల్యాండ్‌ మార్క్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం అభివృద్ధికి సంబంధించి మ్యాప్‌ గురించి మంత్రికి జిల్లా కలెక్టర్‌ పట్టన్‌శెట్టి రవికుమార్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్ని కృష్ణ, తహశీల్దార్‌ గంగాధర్‌, వైసీపీ మండల కార్యదర్శి భీశెట్టి జగన్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ భీశెట్టి వరాహ సత్యవతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జడ్పీటీసీ సభ్యుడు జోసఫ్‌, ఆర్‌ఐ రమేశ్‌, మండల సర్వేయర్‌ మోహనరావు, వీఆర్‌వో రాజ్యలక్ష్మి, లారస్‌ కంపెనీ ప్రతినిధులు ఎస్‌.ఎస్‌.రావు, చావ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T01:19:12+05:30 IST