పాడేరులో ఉత్సవ సందడి
ABN , First Publish Date - 2023-05-10T00:43:38+05:30 IST
పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాల సందడి మొదలైంది. సాధారణంగా మూడు రోజుల ముందు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించాలి. కానీ 12వ తేదీన మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుక ఉండడంతో శుక్రవారం నుంచే పాడేరులో ఉత్సవాల హడావుడి మొదలు కానుంది. దీంతో 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సందడి నెలకొంటుందని ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు అంటున్నారు. దీంతో గురువారంనాటికేఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని నిర్ణయించుకుని ఆయా పనులను శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేయగా, మూలవిరాట్ అలంకరణ ప్రక్రియ గురువారంనాటికి పూర్తవుతుంది.
12న మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుక
14 నుంచి 16 వరకు ప్రధాన ఉత్సవాలు
చకచకా జరుగుతున్న ఏర్పాట్లు
ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న విద్యుత్ సెట్టింగులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాల సందడి మొదలైంది. సాధారణంగా మూడు రోజుల ముందు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించాలి. కానీ 12వ తేదీన మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుక ఉండడంతో శుక్రవారం నుంచే పాడేరులో ఉత్సవాల హడావుడి మొదలు కానుంది. దీంతో 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సందడి నెలకొంటుందని ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు అంటున్నారు. దీంతో గురువారంనాటికేఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని నిర్ణయించుకుని ఆయా పనులను శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేయగా, మూలవిరాట్ అలంకరణ ప్రక్రియ గురువారంనాటికి పూర్తవుతుంది.
ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ అలంకరణలు
ఈ ఏడాది మోదకొండమ్మ ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గత ఏడాది వరకు పాడేరు మెయిన్ రోడ్డుకు మాత్రమే పరిమితమైన విద్యుత్ అలంకరణను ఈ ఏడాది ప్రధాన కూడళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలు 14వ తేదీ నుంచి అయినప్పటికీ, 12వ తేదీ మోదకొండమ్మ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు నుంచే ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఇక పిల్లలు, పెద్దలకు వినోదానిచ్చే జెయింట్ వీల్, డిస్కో డ్యాన్స్, డ్రాగన్ ట్రైన్, బావిలో కార్ల విన్యాసాలు,తదితర వాటికి సంబంధించి ఏర్పాట్లను వేగంగా చేస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవాలను భక్తులను ఆకట్టుకునేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వర్తన పిన్నయ్యదొర, గౌరవ అధ్యక్షుడు కొట్టగుళ్లి సుబ్బారావు తెలిపారు.