సంబల్‌పూర్‌-బెనారస్‌ రైళ్లు విశాఖ వరకు పొడిగింపు

ABN , First Publish Date - 2023-09-26T01:37:26+05:30 IST

సంబల్‌పూర్‌-బెనారస్‌ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వయా టిటాఘర్‌, రాయపూర్‌ మీదుగా విశాఖపట్నం వరకు పొడిగించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం ఆమోదం తెలిపారు.

సంబల్‌పూర్‌-బెనారస్‌ రైళ్లు విశాఖ వరకు పొడిగింపు

విశాఖపట్నం, సెప్టెంబరు 25:

సంబల్‌పూర్‌-బెనారస్‌ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వయా టిటాఘర్‌, రాయపూర్‌ మీదుగా విశాఖపట్నం వరకు పొడిగించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోమవారం ఆమోదం తెలిపారు. వారానికి రెండు రోజులు (బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌) నడిచే ఈ రైళ్లను విశాఖ వరకూ పొడిగించడం వల్ల ఒడిశాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలవారితోపాటు ఆంధ్ర, ఛత్తీస్‌గడ్‌ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T01:37:26+05:30 IST