ఎగ్జిబిషన్ ప్రచార వాహనం ప్రారంభం
ABN , First Publish Date - 2023-02-07T00:59:57+05:30 IST
కేంద్ర బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు.

నర్సీపట్నం అర్బన్ , ఫిబ్రవరి 6: కేంద్ర బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోయే ఫొటో ప్రదర్శన ప్రచార వాహనాన్ని సోమవారం ఆర్డీవో జయరాం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. అజాదీకా అమృత్ మహోత్సవ్ సంబరాల్లో భాగంగా ఈ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సహాయ సంచాలకులు షఫీ మహ్మద్, మునిసిపల్ కమిషనర్ కనకారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.