ఆవ భూముల్లో మట్టి తవ్వకాలు

ABN , First Publish Date - 2023-06-01T01:17:42+05:30 IST

నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లోని దేవవరం, ఒడ్డిమెట్ట, నామవరం, చట్టుపక్కల గ్రామాల్లోని భూములకు సాగునీరందించే దేవవరం ఆవలో అక్రమార్కులు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. భారీ ఎక్స్‌కవేటర్‌ను వినియోగించి మూడు రోజుల నుంచి మట్టిని తవ్వి, ఎనిమిది ట్రిప్పర్‌ లారీల్లో తరలిస్తున్నారు.

ఆవ భూముల్లో మట్టి తవ్వకాలు
ఆవ భూముల్లో ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి లారీల్లోకి లోడింగ్‌ చేస్తున్న దృశ్యం

భారీ టిప్పర్లతో తరలించుకుపోతున్న అక్రమార్కులు

ఒక్కో లోడు రూ.5 వేలకు అమ్మకం

నక్కపల్లి, మే 31: నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లోని దేవవరం, ఒడ్డిమెట్ట, నామవరం, చట్టుపక్కల గ్రామాల్లోని భూములకు సాగునీరందించే దేవవరం ఆవలో అక్రమార్కులు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. భారీ ఎక్స్‌కవేటర్‌ను వినియోగించి మూడు రోజుల నుంచి మట్టిని తవ్వి, ఎనిమిది ట్రిప్పర్‌ లారీల్లో తరలిస్తున్నారు. చట్టుపక్కల ప్రాంతాల్లో ప్రైవేటు లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం, భవన నిర్మాణాల్లో పునాదులను నింపడానికి, ఇటుకబట్టీలకు ఈ మట్టిని విక్రయిస్తున్నారు. ఒక్కో లారీ మట్టి రూ.5 వేలకు అమ్ముతున్నారని కాంగ్రెస్‌ నాయకుడు భూర్తి ఏసుబాబు ఆరోపించారు. ఆవ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై గురువారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

Updated Date - 2023-06-01T01:17:42+05:30 IST