ఏటికొప్పాక హస్త కళాకారుడు సీవీ రాజుకు పద్మశ్రీ

ABN , First Publish Date - 2023-01-26T01:26:38+05:30 IST

జాతీయ స్థాయిలో పేరొందిన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్త కళాకారుడు చింతలపాటి వెంకటపతిరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.

ఏటికొప్పాక హస్త కళాకారుడు సీవీ రాజుకు పద్మశ్రీ

హస్త కళారంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రకటన

ఎలమంచిలి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):

జాతీయ స్థాయిలో పేరొందిన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్త కళాకారుడు చింతలపాటి వెంకటపతిరాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఏటికొప్పాకలో జన్మించిన వెంకటపతిరాజు పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత హస్తకళా రంగంలో ప్రవేశించారు. అంకుడు కర్ర సహాయంతో అద్భుత కళాఖండాలను తయారుచేయడంతోపాటు సహజసిద్ధ రంగులను వినియోగించడం వెంకటపతిరాజు ప్రత్యేకత. ఆయన గ్రామంలో 35 సంవత్సరాలుగా హస్తకళా నిలయాన్ని నిర్వహిస్తున్నారు. పద్మ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా బుధవారం రాత్రి ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ హస్త కళారంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.

Updated Date - 2023-01-26T01:26:39+05:30 IST