గణతంత్ర దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-01-18T00:23:47+05:30 IST

పాడేరులో ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాల క్రిష్ణ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసుతో కలిసి గణతంత్ర దినోత్సవ నిర్వహణపై జిల్లా అధి కారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గణతంత్ర దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు
మాట్లాడున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, పక్కన జేసీ శివశ్రీనివాసు

అధికారులకు ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం

పలు శాఖల శకటాలను సిద్ధం చేయాలని సూచన

పాడేరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పాడేరులో ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాల క్రిష్ణ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసుతో కలిసి గణతంత్ర దినోత్సవ నిర్వహణపై జిల్లా అధి కారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సహకార సంస్థ, పౌర సరఫరాలశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వైద్యారోగ్యశాఖ, కాఫీ విభాగం, డీఆర్‌డీఏ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రగతి శకటాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌, గిరిజన సహకార సంస్థ, వన్‌ధన్‌ వికాస కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌ ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఐ.కొండలరావు, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ పి.రమేశ్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నంద్‌, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:23:50+05:30 IST