డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-06-26T23:05:11+05:30 IST
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఉంటుందని ఏఎంఏఎల్ కళాశాల ప్రిన్సిపాల్ జి.జయబాబు అన్నారు.
అనకాపల్లి(కొత్తూరు), జూన్ 26 : డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఉంటుందని ఏఎంఏఎల్ కళాశాల ప్రిన్సిపాల్ జి.జయబాబు అన్నారు. స్థానిక ఏఎంఏఎల్ కళాశాలలో ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాదక ద్రవ్యాల నిరోధకత, దాని ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల నుంచి డీఎస్పీ కార్యాలయం కూడలి వద్ద వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహేశ్వరరావు, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ నిరంజన్‌కుమార్, ఎన్‌సీసీ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
-పరవాడ మండలం వాడచీపురుపల్లి హైస్కూల్‌లో హెచ్‌ఎం పి. కనకేశ్వరరావు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-ఎలమంచిలిలో ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ, మానవహారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో న్యాయమూర్తులు పి.స్వాతి భవానీ, టి.వీరరాఘవేంద్రరావు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎస్.పట్నాయక్, న్యాయవాది పీవీ.రమణ, ప్రిన్సిపాల్ సరోజని పాల్గొన్నారు. అదే విధంగా ఎలమంచిలి ప్రధాన రోడ్డుపై జరిగిన మరో కార్యక్రమంలో సీఐ గఫూర్, ఎస్‌ఐ పాపినాయుడు, సన్నిబాబు, వెంకట్రావు విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు.
-రాంబిల్లి పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎస్‌ఐ దీనబందు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
-ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం ఎస్‌ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వాడకం వలన కలిగే నష్టాల గురించి వివరిస్తూ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి ఎస్‌ఐ శిరీష తదితరులు పాల్గొన్నారు.