ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-06-03T00:56:43+05:30 IST

స్పందన కార్యక్రమంలో గిరిజనుల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు లోబడి సమస్యలను కచ్చితంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పలు శాఖల అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్పందనలో ప్రజలు అందజేసిన వినతులను సంబంధిత శాఖలకు పంపుతామని, వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలి
స్పందనలో గిరిజనుల సమస్యలు ఆలకిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

స్పందన వినతులపై నిర్లక్ష్యం వద్దు

అధికారులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం

స్పందన కార్యక్రమంలో 95 వినతులు స్వీకరణ

పాడేరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): స్పందన కార్యక్రమంలో గిరిజనుల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు లోబడి సమస్యలను కచ్చితంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పలు శాఖల అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్పందనలో ప్రజలు అందజేసిన వినతులను సంబంధిత శాఖలకు పంపుతామని, వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

స్పందనలో 95 వినతులు స్వీకరణ

ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో గిరిజనుల నుంచి 95 వినతులను అధికారులు స్వీకరించారు. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట నుంచి అన్నవరం గామ్రానికి రోడ్డు నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెను కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివించేందుకు ఆర్థిక సాయం చేయాలని పాడేరు మండలం గుత్తులపుట్టు గ్రామానికి చెందిన కె.రోజారమణి కోరారు. కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ కొమ్మనూరు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. పాడేరు మండలం వంజంగి పంచాయతీ వి.కొత్తూరు గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానిక గిరిజనులు వినతిపత్రం సమర్పించారు. తనకు రాయితీపై వపర్‌ టిల్లర్‌ మంజూరు చేయాలని పాడేరు మండలం కుజ్జెలికి చెందిన రాంబాబు కోరారు. ఇదే మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వంతాల లక్ష్మణరావు... తన కాఫీ తోటను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసి నష్టం కలిగించారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అశుతోష్‌శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ ఐ.కొండలరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:56:43+05:30 IST