రైల్వే ప్రధాన కార్యాలయంలో డీఆర్‌ఎం తనిఖీలు

ABN , First Publish Date - 2023-02-09T00:01:12+05:30 IST

వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యాలయంలో డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

రైల్వే ప్రధాన కార్యాలయంలో డీఆర్‌ఎం తనిఖీలు
తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 8: వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యాలయంలో డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలలోకి ఆకస్మికంగా ప్రవేశించి హాజరు పట్టికను పరిశీలించారు. పని వేళలలో సిబ్బంది కొందరు కార్యాలయంలో కనిపించకపోవడంతో హాజరు పట్టికను తీసుకుని వెళ్లారు. అలాగే కొందరు మధ్యాహ్నం భోజన సమయానికి ఆఫీసుకు హాజరు కావడాన్ని గమనించి వివరాలు తీసుకున్నారు. అనంతరం బ్రాంచి అధికారులతో మాట్లాడుతూ సిబ్బందితోపాటు అధికారులందరూ నిర్ణీత సమయానికి ఆఫీసుకు హాజరుకావాలని, అలాగే పని వేళలలో ప్రతి ఒక్కరు కార్యాలయంలోనే ఉండాలని ఆదేశించారు. ఆలస్యంగా ఆఫీసుకు హాజరయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Updated Date - 2023-02-09T00:01:14+05:30 IST