గర్భిణికి తప్పని డోలీ మోత
ABN , First Publish Date - 2023-12-11T01:11:17+05:30 IST
రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ నిండు గర్భిణిని డోలీలో నాలుగు కిలో మీటర్లు కొండలు, వాగులు దాటుకుంటూ తీసుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజరి పంచాయతీ మూలలోవ గ్రామానికి చెందిన అరడ పార్వతమ్మ నిండు గర్భిణి. ఆమెకు ఆదివారం పురిటి నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు సెల్ సిగ్నల్ గల ప్రదేశానికి వెళ్లి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి ఫీడర్ అంబులెన్స్ కూడా వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో చేసేది లేక ఆశ కార్యకర్త, గ్రామస్థుల సహాయంతో దుప్పటిని కర్రకు కట్టి డోలీ తయారు చేసి అందులో పార్వతమ్మను ఉంచి నాలుగు కిలోమీటర్లు మేర దట్టమైనా కొండలు, వాగులు దాటుకుంటూ అతి కష్టమ్మీద తల్లాబు గ్రామం వరకు చేర్చి అక్కడ నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.
- నాలుగు కిలో మీటర్లు కొండలు, వాగులు దాటుకుంటూ ఆస్పత్రికి తీసుకువెళ్లిన వైనం
పెదబయలు, డిసెంబరు 10: రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ నిండు గర్భిణిని డోలీలో నాలుగు కిలో మీటర్లు కొండలు, వాగులు దాటుకుంటూ తీసుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజరి పంచాయతీ మూలలోవ గ్రామానికి చెందిన అరడ పార్వతమ్మ నిండు గర్భిణి. ఆమెకు ఆదివారం పురిటి నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు సెల్ సిగ్నల్ గల ప్రదేశానికి వెళ్లి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి ఫీడర్ అంబులెన్స్ కూడా వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో చేసేది లేక ఆశ కార్యకర్త, గ్రామస్థుల సహాయంతో దుప్పటిని కర్రకు కట్టి డోలీ తయారు చేసి అందులో పార్వతమ్మను ఉంచి నాలుగు కిలోమీటర్లు మేర దట్టమైనా కొండలు, వాగులు దాటుకుంటూ అతి కష్టమ్మీద తల్లాబు గ్రామం వరకు చేర్చి అక్కడ నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. ఆమెను సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు పరీక్షించి తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఇంజరి సర్పంచ్ రవణమ్మ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తమ పంచాయతీలో 14 గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి తరలించాలంటే డోలీ మోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వారంలో జమదాంగి గ్రామానికి చెందిన వంతాల చిట్టాయినికి పురిటినొప్పులు రావడంతో డోలీలో ఆరు కిలోమీటర్లు మోసుకొని తల్లాబు వరకు చేర్చి గోమంగి పీహెచ్‌సీకు తరలించగా నొప్పులు ఆగిపోవడంతో గ్రామానికి వెనుదిరిగారని చెప్పారు. అయితే మరుసటిరోజు నొప్పులు ప్రారంభమై ప్రసవించగా శిశువు మృతి చెంది ఉందని, డోలీ మోత వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పంచాయతీలో రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు.