సౌత్‌జోన్‌ హాకీ టోర్నీకి జిల్లా క్రీడాకారులు

ABN , First Publish Date - 2023-03-19T01:04:37+05:30 IST

సౌత్‌జోన్‌ హాకీ టోర్నమెంట్‌కు అనకాపల్లి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికైనట్టు అనకాపల్లి జిల్లా అసోసియేషన్‌ కో-ఆర్డినేటర్‌ కొఠారు నరేశ్‌ శనివారం తెలిపారు.

సౌత్‌జోన్‌ హాకీ టోర్నీకి జిల్లా క్రీడాకారులు
సౌత్‌జోన్‌ హాకీ టోర్నీకి జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారులు

తొలిసారిగా ముగ్గురు ఎంపిక

ఎలమంచిలి, మార్చి 18: సౌత్‌జోన్‌ హాకీ టోర్నమెంట్‌కు అనకాపల్లి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికైనట్టు అనకాపల్లి జిల్లా అసోసియేషన్‌ కో-ఆర్డినేటర్‌ కొఠారు నరేశ్‌ శనివారం తెలిపారు. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకూ చెన్నైలోని రామ్‌నాథ్‌పూర్‌లో ఈ టోర్నమెంట్‌ జరుగుతుందన్నారు. ఈ టోర్నీలో పురుషుల విభాగంలో ఎలమంచిలికి చెందిన కొఠారు తేజ, అప్పికొండ వెంకటేశ్‌, మహిళా విభాగంలో దేవరాపల్లికి చెందిన ఝాన్సీ ఎంపికైనట్టు తెలిపారు. హాకీ ఇండియా ఏర్పడిన తరువాత తొలిసారిగా ఈ టోర్నీలో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఎంపికైన క్రీడాకారులను స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు అభినందించారు.

Updated Date - 2023-03-19T01:04:37+05:30 IST