డీఐఈవో బెన్నస్వామి సస్పెన్షన్‌?

ABN , First Publish Date - 2023-06-07T00:56:11+05:30 IST

జిల్లా ఇంటర్‌ విద్యా శాఖధికారి (డీఐఈవో) బెన్నస్వామిని ఆ శాఖ ఉన్నతాఽధికారులు సస్పెండ్‌ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను ఆయన సక్రమంగా పర్యవేక్షించలేదనే అభియోగంపై ఆయనపై చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

డీఐఈవో బెన్నస్వామి సస్పెన్షన్‌?
పాడేరులో తాళం వేసి వున్న డీఐఈవో కార్యాలయం

నాడు-నేడు పనులు పర్యవేక్షించడంలేదని వేటు

పాడేరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇంటర్‌ విద్యా శాఖధికారి (డీఐఈవో) బెన్నస్వామిని ఆ శాఖ ఉన్నతాఽధికారులు సస్పెండ్‌ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను ఆయన సక్రమంగా పర్యవేక్షించలేదనే అభియోగంపై ఆయనపై చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఇస్లాంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న బెన్నస్వామిని, కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఇంటర్‌ విద్యా శాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలోని కళాశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పర్యవేక్షించాల్సిన ఆయన ఏమీ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో బెన్నస్వామిని సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది. కాగా ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఉన్న జిల్లా ఇంటర్‌ విద్యా శాఖాధికారి కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉంది. పైగా అక్కడ ఇంటర్‌ విద్యకు సంబంధించి సమాచారం చెప్పేందుకు ఎవరూ లేరు. కొత్తగా ఏర్పడిన అల్లూరి జిల్లాలో అధిక శాతం జిల్లా అధికారుల పోస్టులను ఇన్‌ఛార్జి లేదా పూర్తి అదనపు బాధ్యతలుగా అప్పగిస్తుండడంతో కొన్ని జిల్లా కార్యాలయాల పరిస్థితి ఇలానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-06-07T00:56:11+05:30 IST