అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా
ABN , First Publish Date - 2023-11-22T00:19:37+05:30 IST
తమ సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల శాఖ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలు పెందుర్తిలోని ఐసీడీసీ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

పెందుర్తి, నవంబరు 21: తమ సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల శాఖ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలు పెందుర్తిలోని ఐసీడీసీ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు బ్యానర్లు పట్టుకుని తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు ఎనిమిదిన నిరవధిక సమ్మె చేపట్టనున్నామన్నామన్నారు. అసోసియేషన్ గౌరవ సలహాదారు ఆర్.బృందావతి మాట్లాడుతూ అంగన్‌వాడీలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.