రక్షణ కరువు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:05 AM
మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో కాకరపాడు సమీపంలో గల కొండవాగు ప్రవాహంపై నిర్మించిన వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- కాకరపాడు వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదాలు
- భీతిల్లుతున్న వాహనచోదకులు
కొయ్యూరు, డిసెంబరు 25: మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో కాకరపాడు సమీపంలో గల కొండవాగు ప్రవాహంపై నిర్మించిన వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనకు సమీపంలో మలుపు ఉండడంతో అటుగా వచ్చే వాహనచోదకులు అదుపుతప్పి వాగులోకి దూసుకుపోతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోతున్నారు. దీనిపై రోడ్లు, భవనాల శాఖ జేఈ ప్రసాద్‌ను వివరణ కోరగా దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఈలోగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.