పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2023-06-26T22:59:33+05:30 IST

పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. కోటేశ్వరరావు అన్నారు.

పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలి
పట్టణంలో నిధి వసూలు చేస్తున్న సీపీఎం నాయకులు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 26 : పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. కోటేశ్వరరావు అన్నారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితుల పాదయాత్రకు సంఘీభావంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నెహ్రూచౌక్‌ వరకు సీపీఎం నాయకులు నిధి వసూలు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చట్ట ప్రకారం తక్షణమే పునరావాసం, పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్‌.శంకరరావు, గంటా శ్రీరామ్‌, ఎ.బాలకృష్ణ, బి.ఉమామహేశ్వరరావు, డి. శ్రీనివాసరావు, కె. ఈశ్వరరావు, డీడీ వరలక్ష్మి, పి.చలపతి, బి.నూకఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:59:33+05:30 IST