కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-06-19T23:45:28+05:30 IST

కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది.

కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి
తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న దృశ్యం

మునగపాక, జూన్‌ 19: కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ.. మండలంలో నూటికి 70 శాతం మందికి పైగా కౌలు రైతులు ఉన్నారన్నారు. సీసీఆర్‌సీ చట్టాన్ని సవరించి భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, వీవీ. శ్రీనివాసరావు, ఎస్‌.బ్రహ్మాజీ, టెక్కలి జగ్గప్పారావు, కౌలు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-19T23:45:28+05:30 IST