ముదపాకలో హెచ్చరిక బోర్డుల వివాదం

ABN , First Publish Date - 2023-02-21T00:49:07+05:30 IST

మండలంలోని ముదపాకలో జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం చేపట్టిన భూ సమీకరణ ఆది నుంచీ వివాదాస్పదమవుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు పరిహారం కింద ఇప్పటికీ పట్టాలు, ఎల్‌పీసీలు ఇవ్వకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముదపాకలో హెచ్చరిక బోర్డుల వివాదం

పెందుర్తి, ఫిబ్రవరి 20 : మండలంలోని ముదపాకలో జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం చేపట్టిన భూ సమీకరణ ఆది నుంచీ వివాదాస్పదమవుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు పరిహారం కింద ఇప్పటికీ పట్టాలు, ఎల్‌పీసీలు ఇవ్వకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌కు అంగీకరించని కొంతమంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేటస్‌ కో తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సుమారు 55 ఎకరాలు మేర వారికి చెందిన భూముల్లో రైతులుహెచ్చరిక బోర్డు పెట్టారు. వారు బోర్డు పెట్టిన స్థలంలోనే సోమవారం రెవెన్యూ శాఖాధికారులు కొత్త బోర్డు పెట్టారు. పేదలందరికీ ఇళ్లు నిర్మించుకునేందుకు సర్వే నంబర్‌ 1 నుంచి 76 వరకు వున్న ప్రభుత్వ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించామన్న సారాంఽశంతో బోర్డు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బోర్డు పెట్టినట్టు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. రైతులు పెట్టిన బోర్టుకు అడ్డుగా దీన్ని పాతారు. వివాదం కోర్టులో నడుస్తున్నప్పుడు భూముల్లో బోర్డు పెట్టడం ఏమిటని రైతులు రెవెన్యూ సిబ్బందిని అడ్డగించారు. ఆర్‌డీఓ ఆదేశాల మేరకు తాము బోర్డు పెట్టామని వారు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తప్పుడు పత్రాలతో కోర్టును మఽభ్యపెట్టే చర్యలకు పాల్పడుతున్నారని, ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని వారు చెప్పారు.

Updated Date - 2023-02-21T00:49:15+05:30 IST