Share News

అంగన్‌వాడీల ఆందోళన

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:58 AM

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరింది.

అంగన్‌వాడీల ఆందోళన

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరింది. కార్యకర్తలు, హెల్పర్లు ఎక్కడికక్కడ ర్యాలీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పాలకులు మొండివైఖరి విడనాడి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు గత ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న శిబిరాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ, జనసేన నాయకులు రఘు, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ డాక్టర్‌ శీతల్‌, తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

Updated Date - Dec 23 , 2023 | 12:58 AM