అర్జీలపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేది లేదు
ABN , First Publish Date - 2023-02-07T01:09:56+05:30 IST
స్పందనలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి అధికారులను హెచ్చరించారు.

అనకాపల్లి కలెక్టరేట్, ఫిబ్రవరి 6 : స్పందనలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి అధికారులను హెచ్చరించారు. ఇక్కడి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయనతో పాటు జేసీ కల్పనాకుమారి, డీఆర్‌వో పి.వెంకటరమణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అంతకు ముందు కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతి వారం వస్తున్న అర్జీల్లో ఎన్నింటికి పరిష్కారం చూపారు, పరిష్కారం చూపని వాటి వివరాలు ఆయా శాఖల వద్ద ఉండాలన్నారు. పరిష్కారం కాని సమస్యలపై అర్జీదారులకు వివరించాలన్నారు. ఇదిలావుంటే, సాయంత్రానికి 200 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారంలో ముందుండాలి : ఎస్పీ గౌతమిశాలి
అనకాపల్లి రూరల్ : స్పందన అర్జీల పరిష్కారంలో పోలీసు శాఖకు మంచి గుర్తింపు వచ్చేలా అధికారులు వ్యవహరించాలని ఎస్పీ గౌతమి శాలి సూచించారు. ఇక్కడి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె పలువురి నుంచి వినతులను స్వీకరించి, వారి వారి సమస్యలు తెలుసుకున్నారు. అంతకుముందు అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సాయంత్రానికి 26 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు.