28న ఎయిర్‌పోర్టులో సీఎం ట్రాన్సిట్‌ హాల్ట్‌

ABN , First Publish Date - 2023-06-26T01:09:33+05:30 IST

అమ్మఒడి నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఈనెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరగనుంది.

28న ఎయిర్‌పోర్టులో సీఎం ట్రాన్సిట్‌ హాల్ట్‌

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

అమ్మఒడి నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఈనెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఇందుకోసం 28వ తేదీ ఉదయం 9.15 గంటలకు గన్నవరం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో పార్వతీపురం మన్యం జిల్లాకు వెళతారు. కార్యక్రమం ముగిసిన తరువాత మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 1.45 గంటలకు విమానంలో గన్నవరం వెళతారు.

Updated Date - 2023-06-26T01:09:33+05:30 IST