కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి

ABN , First Publish Date - 2023-06-07T00:47:22+05:30 IST

కౌలు రైతులకు భూ యజమాని ఆమోదంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులివ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నరసింగరావు డిమాండ్‌ చేశారు.

కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నరసింగరావు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 6: కౌలు రైతులకు భూ యజమాని ఆమోదంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులివ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నరసింగరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక గవరపాలెం పాలకేంద్రం వద్ద జరిగిన జీపుజాతా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూటికి 70 మంది కౌలు రైతులున్నారన్నారు. వీరికి ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈనెల 12న విజయవాడ నుంచి మంగళగిరి వరకు జరిగే మహాపాదయాత్రలో కౌలు రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎ.బాలకృష్ణ, కె.తేలయ్యబాబు, బి. ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:47:22+05:30 IST